![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -465 లో.. కళ్యాణ్ దగ్గరికి రాజ్ వచ్చి ఇలా ఎన్ని రోజులు కూర్చొని ఉంటావ్.. ఎందుకు డల్ గా ఉంటావని రాజ్ అనగానే.. నావల్ల ఇదంతా జరిగింది. అప్పు బాధ్యత నాదే అని కళ్యాణ్ అంటాడు. ఏం చేస్తావ్ రా ఏదైనా చెయ్యాలంటే చెయ్యడానికి నేనున్నా.. మీ వదిన ఉందని చెప్పి కళ్యాణ్ ని ఆ సంఘటన నుండి బయటకు తీసుకొని రావడానికి రాజ్ ట్రై చేస్తాడు.
ఆ తర్వాత రాజ్ దగ్గరికి ఇందిరాదేవి వస్తుంది. నువ్వు కళ్యాణ్ తో మాట్లాడింది అంత విన్నాను. ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించేనా.. నీ గురించి నీ భార్య గురించి పట్టించుకునుడు లేదా నీ భార్యకి కూడా కోరికలు సరదాలు ఉంటాయి కదా.. అవి పట్టించుకోవా అని ఇందిరాదేవి రాజ్ ని నిలదీస్తుంది. అదంతా కళ్యాణ్ వింటూ ఉంటాడు. మరొకవైపు కిచెన్ లో వంట చేస్తున్న కావ్య దగ్గరికి అపర్ణ వెళ్లి.. ఏం చేస్తున్నావని అడుగుతుంది. పెరుగు కి తోడు పెడుతున్నా అని కావ్య అనగానే.. ఈ ఇంట్లో అందరికి తోడు ఉంది ఒక రుద్రాణికి తప్పా.. అయినా ఎప్పుడు ఆ పని చెయ్యడం.. ఈ పని చేయడమేనా నీకంటూ సరదాగా కోరికలు ఉండవా.. మరిది గురించి ఆలోచిస్తావ్.. అత్తమామల గురించి ఆలోచిస్తావ్.. నీ భర్త గురించి ఆలోచిస్తావ్.. ఇక నీ గురించి ఎప్పుడు ఆలోచిస్తావ్.. నీ కాపురం బాగుండాలి నీ కడుపు పండాలని కావ్యతో అపర్ణ చెప్తుంది.
ఆ తర్వాత కావ్య, రాజ్ లు ఒకేసారి గదిలోకి వెళ్తారు. ఈ రోజు నుండి నువ్వు చేసిన తప్పులు అన్ని క్షమించేస్తున్నానని రాజ్ అనగానే.. నేనేం తప్పు చెయ్యలేదు.. అంత మీరే చేశారని కావ్య అంటుంది. అలా ఇద్దరు రాత్రంతా ఆర్గుమెంట్ చేస్తునే ఉంటారు. తరువాయి భాగంలో కావ్యని రాజ్ డిన్నర్ కి తీసుకొని వెళ్లి.. తన ప్రేమ విషయం చెప్పాలనుకుంటాడు. కావ్యని రాజ్ డిన్నర్ కి పిలుస్తాడు. ఆ విషయం తెలుసుకున్న రుద్రాణి.. రాజ్ ప్రేమని కావ్యకి చెప్పకుండా చెయ్యాలని రాహుల్ కి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |